జ‌నంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు.. ఒక‌రి మృతి

తిరుప‌తి(CLiC2NEWS): తిరుపతిలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరొకరికి తీవ్ర గాయాల‌య్యాయి. తిరుపతిలోని సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వెళ్తున్న క్ర‌మంలో కర్నాల వీధి దగ్గర అదుపు తప్పి అకస్మాత్తుగా జనంపైకి దూసుకు వెళ్లింది. బస్సు బీభత్సానికి రెండు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 4 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. చివ‌ర‌గా బస్సు మరో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.  పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.