జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు పురపాలక మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు జర్నలిస్టులు
ఉన్నారు.