జ‌వాన్‌ను చైనాకు అప్ప‌గించిన భార‌త్‌

న్యూఢిల్లీ: జ‌న‌వ‌రి 8వ తేదీన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికుడు ల‌ఢాక్‌లోని ఎల్ఏసీ వ‌ద్ద స‌రిహ‌ద్దు దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చిన చైనా జవాన్‌ను ఆ దేశ సైన్యానికి ఇండియ‌న్ ఆర్మీ ఇవాళ (సోమ‌వారం) తిరిగి అప్ప‌గించింది. అయితే త‌మ సైనికుడు అదృశ్య‌మైన‌ట్టు చైనా ఆర్మీ శ‌నివారం ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత త‌మ భూభాగ ప‌రిధిలోకి వ‌చ్చినందున ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ ప్ర‌క‌టించింది. మొత్తంగా ఇవాళ ఉద‌యం 10:10 గంట‌ల‌కు స‌రిహ‌ద్దులోని చూషుల్ – మోల్దో వ‌ద్ద సైనికుడిని చైనా సైన్యానికి భార‌త బ‌ల‌గాలు అప్ప‌గించాయి.

Leave A Reply

Your email address will not be published.