ఝాన్నీ లక్ష్మీబాయికి ప్రధాని మోడీ నివాళి

న్యూఢిల్లీ : మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా పిలిచే 1857లో జరిగిన తిరుగుబాటులో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన రాణి లక్ష్మీబాయి ఇదే రోజు 1828లో వారణాసిలో జన్మించారు. ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి సందర్భంగా గురువారం ప్రధాని మోడీ ఘన నివాళులర్పించారు. లక్ష్మీబాయి వీరత్వం దేశవాసులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. స్వాతంత్రోద్యమ మొదటి యుద్ధంలో తన అద్భుతమైన పరాక్రమాన్ని పరిచయం చేసిన ధైర్యవంతురాలైన రాణి ఝాన్సీలక్షీబాయి అని కొనియాడుతూ ట్వీట్ చేశారు.
I bow to Rani Lakshmibai on her birth anniversary. She epitomised ultimate courage & bravery. Her patriotic zeal inspires every Indian.
— Narendra Modi (@narendramodi) November 19, 2014