టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. టిఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవిని సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నల్లొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఖరారు చేసిన గులాబీ పార్టీ.. తాజా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ కు వాణీదేవిని ఎంపిక చేసింది.