టి.వి.జి.: మిరియాల వెంకట్రావు ..కాపునాడు వ్యస్థాపకులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో కాపు సంఘాలు అంటూ తెలియని రోజుల్లో కాపు సంఘాల గురించి తెలియజేసిన మహానుభావుడు కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1939 డిసెంబర్‌ 25న జన్మించిన వెంకట్రావుకు భార్య ప్రమీణ, కొడుకు ఎం.వి.శేషగిరిబాబు ఐఎఎస్. కూతురు స్వాతి ఉన్నారు. శేషగిరిబాబు డైనమిక్ అధికారి.స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కూతురు స్వాతి కెనడాలో ఉంటుంది. తొలుత ముత్యాలు, పగడాల వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు తర్వాత సివిల్‌ కాంట్రాక్టులు చేసేవారు.రాజమండ్రిలో నివాసం ఉండి భారత దేశంలో కాపులను చైతన్యవంతులను చేసారు.ఈ క్రమంలో కుటుంబ సభ్యులను కూడా విస్మరించి కాపుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారు. కాపునాడు వ్వవస్థాపక అధ్యక్షులుగా తెలుగు ప్రాంతాలు నలుమూలలా పర్యటించి సేవలు అందించారు.

కాపులకు రాజకీయంగా అన్యాయంగా జరుగుతోందంటూ 1982లో ఆయన విజయవాడలో కాపునాడును ఏర్పాటు చేశారు. నాటి నుంచి కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు . కాపు, తెలగ, ఒంటరి, తూర్పుకాపు, మున్నూరు కాపులను ఏకతాటికిపై తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పలు సందర్భాల్లో ఉద్యమిస్తూ వచ్చారు. విశాఖపట్టణంలోని సీతమ్మధార నుండి కాపులకు ఒక పత్రికను ప్రారంభించి ఉచితంగా కాపులకు పంపేవారు ..తాను చేస్తున్న సేవలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ఆయనకు మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్‌గా నియమించింది .అయన కాపుల అభివృద్ధికి అనలేని కృషి చేసారు .అయన కాపు సంఘానికి ఎనలేని కృషి చేసిన మహానుభావుడు . అయన 75 వ శకంలో యూరినరీ ట్రాక్‌ ఇన్‌ ఫెక్షన్‌ (యుటీఐ)తో బాధపడుతున్న వెంకట్రావు సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చేరారు. నాటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ 2014 వ సంవత్సరం 10 వ తేదీన ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.