టి.వేదాంతసూరి: వృద్ధుల‌కు న్యూజిలాండ్ స్వర్గధామం

ఆక్లాండ్: న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు రావడం ఇది మూడో సారి.. ఇక్కడే పిల్లలంతా ఉండటం వాళ్ళ విదేశీ గడ్డపై వున్నానని అనిపించడం లేదు.. కానీ బయటకు వెళితే అది గుర్తొస్తుంది.. ఇక్కడ వయో వృద్దులకు స్వర్గ ధామంగా ఉంటుంది.. నూరేళ్ళకు అటు ఇటుగా ఉండేవారు చాల మంది నడుస్తూ. తమ పని తాము చేసుకుంటూ కనిపిస్తారు.. ఒకరు సహకరించాలని. ఎవరో జాలి పడాలని అనుకోరు.. సహకరిస్తాం అంటే చిన్న చూపు చూసినట్టుగా భావిస్తారు. షాపింగ్ వెళ్లి తమకు కావలసినవన్నీ తెచ్చు కుంటారు.. అనారోగ్యం చేస్తే ఉచిత వైద్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంటుంది.. మరీ బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితుల్లో పరిచర్యలను చేయడానికి మనుషులను ఏర్పాటు చేసి.. వారి వేతనం ప్రభుత్వమే చెల్లిస్తుంది.. అంతే కాదు వయో వృద్దులకు ఓల్డ్ ఏజ్ హోమ్ లు కూడా ఉంటాయి.. అవి ఉచితంగా ఇస్తారు. ఎలాంటి వారైనా బాధ్యతగా వ్యవహరిస్తారు.. వారికి పింఛను కూడా తగినంత ప్రభుత్వమే చెల్లిస్తుంది.. ఏ బాధా ఉండదు. ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండకుండా. మానసిక ప్రశాంతతతో ఇక్కడ వారు జీవనం కొనసాగిస్తారు..

Leave A Reply

Your email address will not be published.