టి. వేదాంత సూరి : ఇది మనం స్వాతంత్ర దినం

టి. వేదాంత సూరి : ఇది మనం స్వాతంత్ర దినం

ప్రపంచం లో ఆగష్టు 15 కు ప్రాధాన్యత లేకున్నా.. మనకు ఒక ప్రత్యేకత వుంది.. ఇది మనం స్వాతంత్ర దినం జరుపునే రోజు. మనకు స్వతంత్రం వచ్చి 73 ఏళ్ళు.. గడిచి పోయాయి. కానీ ఫలితాలు చాలా తక్కువే.. రాజ్యాంగం లోని లొసుగులను తెలుసుకొంటూ ప్రజలను, సమాజాన్ని మోసం చేయడం అలవాటు చేసుకున్నారు.. కొత్తగా డబ్బు మీద వ్యామోహం పెరిగింది. దీనితో సమాజానికి ఇవ్వాలనేది మరిచి సమాజాన్ని ఎలా దోచుకోవాలో నేర్చుకుంటున్నారు. ఇది కరోనా కంటే పెద్ద ప్రమాదం. అందుకోసం. సమాజం లోని అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీయాలి. కానీ ఆలా జరగడం లేదు.. కారణం ప్రజల్లో అవగాహనా లోపం, నిరక్షరాస్యత .. పార్టీలు పెట్టేది, అందులో చేరేది ప్రజలకు సేవ చేయడానికి కాదు.. సమాజాన్ని దోచుకోవడానికి . నిజాయితీ.. ప్రేమ పొరుగు వారికి సహాయ పడటం అని గుణం కూడా అడుగంటి పోయింది. ప్రజల్లో అవగాహన పెరగాలి. ఓటు  వేసేప్పుడు ఆలోచించడం నేర్చుకోవాలి. నిజాయితీ పరులను ఆదరించాలి. పార్టీతో ప్రమేయం లేకుండా. జనం గుండాల్లో పదిలంగా వుండేవారికోసం మనం గాలించాలి. డబ్బు వున్నవాడు. ఇంకా పెంచుకుంటున్నాడు. లేని వాడు అడుగంటి పోతున్నాడు.. ఈ అంతరాల నుంచి బయట పడాలి. అందుకు అన్ని రంగాల వారు ముందుకు రావాలి. లేకుంటే ఎన్ని పండుగలు చేసుకున్న ఫలితం ఉండదు.

Leave A Reply

Your email address will not be published.