టి. వేదాంత సూరి : మన దేశం లో ప్రతి పక్షం ఉన్నదా. ?
టి. వేదాంత సూరి : మన దేశం లో ప్రతి పక్షం ఉన్నదా. ?
మన దేశం లో ప్రతి పక్షం ఉన్నదా. ? అనే ప్రశ్న ఒక్కోసారి నాలో వస్తుంది.. అసలు ప్రతిపక్షం ఎలా వుండాలి. ఎలా వ్యవహరించాలో కూడా ఎవరికీ తెలియదు. ఇన్నాళ్లు అధికారాన్ని వెలగ బెట్టిన వారే ఇప్పుడు ప్రతిపక్షం లో కూర్చున్నారు.. ఎవరూ నిజాయితీ పరులు కాదు. తరతరాలకు సరిపడా ఆస్తి సంపాదించుకున్న వారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి అవినీతికి పాల్పడిన వారు. అధికార పక్షం లో వున్నవారు ఎలాంటి అవినీతికి పాల్పడతారో తెలిసిన వారు. అందుకే ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు అధికార పక్షాన్ని తిడుతూనే వుంటారు. దీని వలన వారు ప్రజల్లో చులకన అవుతారన్న జ్ఞానం ఉండదు. ప్రతిపక్షం అంటే ప్రజల అవసరాలు తెలుసుకుని ఆదుకోవాలి. మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఎన్నికల వరకే తిట్లు పరిమితం కావలి. కానీ పాపం ప్రతిపక్షం ఏం చేయాలో కూడా తెలియని అమాయకులు వీళ్ళు. ఓట్లు ఎక్కువ వేసి, అధికారం కట్టబెట్టిన ప్రజలు.. ప్రతిపక్షాలు వారిని తిడుతుంటే ఎలాంటి అభిప్రాయానికి వస్తారో కూడా తెలియని అర్భకులు.. వీళ్ళు. తరతరాలుగా అధికార దాహంతో వుండే వీరందరిని ప్రజలు పక్కన పెట్టాలి. ప్రజల్లో మార్పు రావాలి. అవగాహన పెంచుకోవాలి. ఓటుకు అమ్ముడు పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈ శుభదినం మీరంతా ఈ నిర్ణయం తీసుకోవాలి. నిజాయితీ ప్రజలకు బాధ్యత వహించే నాయకులను ఎన్నిక చేసుకొనే కనీస బాధ్యత దేశ పౌరులందరిది ..