టీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య

సిద్దిపేట: దుబ్బాక అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించింది. రామలింగారెడ్డి భార్య సుజాత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని సీఎం కేసీఆర్ తెలిపారు. దుబ్బాక అభివృద్ధికి చివరిశ్వాస వరకు రామలింగారెడ్డి పని చేశారని చెప్పారు. రామలింగారెడ్డి తలపెట్టిన అభివృద్ధిని కొనసాగించేందుకు వారి కుటుంబానికి ఇవ్వడమే సమంజసమన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రామలింగారెడ్డి చివరిశ్వాస వరకు ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. జిల్లా నాయకులను సంప్రదించి అభ్యర్ధిత్వం ఖరారు చేశామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తూ అటు ఉద్యమంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలుపంచుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధి కొనసాగడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలుకావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సమంజసమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.