టీఆర్‌ఎస్‌లో `కౌన్సిల‌ర్ల` రచ్చ

వేములవాడ‌లో తన్నుకున్న నాయకులు

వేముల‌వాడ‌: అధికార టిఆర్ ఎస్ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్లు కొట్లాట‌కు దిగిన ఘ‌ట‌న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో చోటుచేసుకుంది. సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. అధికార పార్టీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లా మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది. సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో నెట్టేసుకుంటు సంఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంత మంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. అయితే గత కొంత కాలంగా మున్సిపల్‌లో చైర్మన్ రామ తీర్థపు మాధవి, అతని భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు తన్నుకోవడంపై అధిష్టానం, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్‌ స్పందించలేదు.

Leave A Reply

Your email address will not be published.