టీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో సోదాలు
సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో టిఆర్ ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉప ఎన్నిక కోసం భారీగా నగదు ప్రవాహం కొనసాగుతుందన్న సమాచారంతో వివిధ పార్టీల నాయకులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం పోలీసులు టీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏక కాలం లో 8 మంది టీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా తనిఖీచేశారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నగదు ఏమీ దొరకలేదని తెలిసింది.