టీకా తీసుకున్న స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌

హైదరాబాద్‌: దేశ‌వ్యాప్తంగా రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. దీనిలో భాగంగా బుధ‌వారం శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావుగౌడ్‌ కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా సుఖ‌స్త్రంద‌ర్‌రెడ్డి నిమ్స్‌లో టీకా వేయించుకున్నారు. అలాగే పద్మారావుగౌడ్‌ సికింద్రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లువురు మంత్రులు టీవా తీసుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.