ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు దుర్మరణం
కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. పోచవరం గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. చిన్నకోరుకొండ గ్రామానికి చెందిన రెడ్డి రామకృష్ణ (36) ఇంటి గోపి (24) వ్యక్తిగత పనులపై సాయంత్రం బైక్పై పోచవరం గ్రామంలో పనులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తుండగా పోచవరం శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

[…] […]