డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట : సిద్దిపేట అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆర్థిక శాక మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని బొగ్గులోని బండ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జానెడు మోరి.. మూరెడు సీసీరోడ్డు లేని గ్రామానికి నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బొగ్గులోని బండ గ్రామానికి మహిళా భవనం, గ్రామ పంచాయతీ భవనం, మరికొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సాంక్షన్ చేస్తామన్నారు. గ్రామంలో ఇంకా పూర్తిగా ఇండ్లు లేని వారిని గుర్తించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ రోడ్డులో పలు జిల్లా భవనాలను తీసుకు వచ్చాం. మిట్టపల్లి సమీపంలో కూడా రైల్వే స్టేషన్, జిల్లా కోర్టు, జిల్లా పరిషత్ భవనాలు తీసుకువస్తామని పేర్కొన్నారు. అటు కరీంనగర్, మెదక్ రోడ్డు వైపు కూడా కొన్ని కంపెనీలు, జిల్లా భవనాలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.