డోర్నకల్‌లో డిసిఎం బోల్తా: 70 గొర్రెలు మృతి
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో డిసిఎం వాహనం బోల్తా పడి 70 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల లోడ్‌తో వెళ్తున్న ఓ డీసీఎం బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గొర్రెల లోడుతో ఓ డీసీఎం గూడూరు నుంచి మధిర వెళ్తుండగా బుధవారం ఉదయం డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస సమీపంలో అదుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న జీవాలు మరణించాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.