డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్టేజ్‌పై కాలు కదిపారు. జానపద కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. తాజాగా, మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఆమె.. స్టేజ్‌పై స్టెప్పులతో ఆకట్టుకున్నారు. కొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యూజీషియన్లు, గాయకులు, నృత్యకారులు నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో మమతా పాల్గొన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంతల్ డ్యాన్సర్ బసంతీ హేమ్‌బ్రమ్‌ను సీఎం మమతా బెనర్జీ సన్మానించారు. అయితే స్టేజ్‌పై స్టెప్పులేస్తున్న బసంతితో .. మమతా కూడా డ్యాన్స్‌చేసి అందరినీ అలరించారు. తనకు స్టెప్పులు నేర్పించాలంటూ అడిగిన దీదీ.. అదే జోష్ లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది
ఫెస్టివల్‌లో చిందులేసిన మమతా బెనర్జీ.. ఆ తర్వాత తన ప్రసంగంలో బీజేపీని టార్గెట్ చేశారు. బెంగాల్‌ను ఎన్నటికీ గుజరాత్‌లా మార్చబోమన్నారు. జాతీయ గీతం, జాతీయ పాట, జై హింద్ లాంటి స్లోగన్స్ అన్నీ బెంగాల్‌లోనే పుట్టాయని ఆమె అన్నారు. ఏదో ఒక రోజు యావత్ ప్రపంచం బెంగాల్‌కు సెల్యూట్ చేస్తుందన్నారు.