ఢిల్లీలో ఒక్కరోజే 8వేలకు పైగా కేసుల నమోదు

న్యూఢిల్లీ: దేశంలో చలికాలం ప్రారంభం అవ్వడంతో పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్‌ కొనసాగుతోంది. దేశ రాజధాని హ‌స్తిన‌లో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 8,593 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,59,975కు చేరింది. ఇక 24 గంటల్లో 85 మంది మరణించగా.. మృతుల సంఖ్య 7,228కి చేరింది. అలాగే 7,264 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. కోలుకున్న వారి సంఖ్య 4,10,118కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 41,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఢిల్లీలో మూడో వేవ్ ప్రారంభమైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. త్వరలోనే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.