ఢిల్లీలో కొత్త‌గా 161 మ‌ర‌ణాలు.. 25,462 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 25 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 25,462 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 8,53,460కు చేరింది.

కాగా తాజాగా 161 మ‌ర‌ణాలు రిపోర్ట్ అయ్యాయి. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణాల సంఖ్య 12,121కు పెరిగింది. మ‌రోవైపు ఢిల్లీలో గ‌త 24 గంట‌ల్లో 20,159 మంది క‌రోనా రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్న‌వారి మొత్తం సంఖ్య 7,66,398కు చేరింది. ప్ర‌స్తుతం 74,941 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

ఇక్క‌డ‌ క‌రోనా రోగుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల కొర‌త ఏర్ప‌డుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో కామ‌న్‌వెల్త్‌గేమ్స్ గ్రామంలో క‌రోనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆదివారం దీనిని సంద‌ర్శించారు. య‌మునా స్పొర్ట్స్ కంపెక్స్‌లో 800 ఆక్సిజ‌న్ బెడ్లు, ఇత‌ర చోట్ల మ‌రో 500 ఆక్సిజ‌న్ బెడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.