ఢిల్లీలో ఘాటెక్కిన ఉల్లి..
న్యూ ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఉల్లిని కొనాలంటేనే సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడ ఉల్లితోపాటు కూరగాయల ధరలు కూడా సామాన్యులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. గత 15 రోజుల క్రితం ఉల్లి ధర కిలోకు 20 రూపాయలు పలికితే.. ఇప్పుడు కిలో ఉల్లి రూ.45 కు పలుకుతోంది. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటకాల్లో ఉల్లి వినియోగాన్ని మానేశారు. ఉల్లికి బదులుగా ఖీరా, క్యారెట్ లను ఉపయోగిస్తున్నారు.
అలాగే ఇక్కడ ఉల్లితోపాటు ఆలూ ధరలు కూడా అమాంతం పెరిగాయి. గతంలో హోల్ సేల్ లో కిలో ఆరు నుంచి ఏడు రూపాయలకు లభించే ఆలూ ప్రస్తుతం రూ.20 కి దొరుకుతోంది.