ఢిల్లీ ముఖ్యమంత్రి గృహనిర్భంధం
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’ కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతుగా పలు సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సోమవారం సింఘు సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను బయటకు రానీవ్వడం లేదు. ఆయన నివాసంవద్ద భారీస్థాయిలో బలగాల్ని మోహరించినట్లు వెల్లడించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది.