తాడ్వాయిలో రైతు వేదిక రెడీ

తాడ్వాయిః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు జిల్లాలో నూరుశాతం పూర్తయి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పంచాయతీరాజ్ ఇంజనీర్లను, అధికారులను అభినందించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ రాజ్, ట్రాన్స్కో, వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ ఈసంగతి తెలిపారు. రైతు వేదిక భవనాల చుట్టూ రెండు వరుసలలో పెద్ద మొక్కలు నాటాలని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కనెక్షన్ కల్పించాలని, విద్యుత్ కనెక్షన్ తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. రైతు బంధు సమితి కన్వీనర్ లు, ఏజెన్సీల ప్రతినిధులు, ఏఈవోలతో చర్చించి మొక్కలు రైతు వేదికల చుట్టూ మొక్కలు నాటే విధంగా చూడాలని కోరారు. ఎఫ్ టి ఓ జనరేట్ చేయడంలో బీబీపేట, దోమకొండ పంచాయతీ రాజ్ అధికారులు మొదటి స్థానంలో ఉన్నారని వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.