తాను మరణిస్తూ..ఐదుగురికి జీవనదానం

సికింద్రాబాద్‌: తాను మరణిస్తూ ఓ మహిళ ఐదుగురికి జీవనదానం చేసింది. సికింద్రాబాద్‌ బొల్లారం బజార్‌ సూర్యకాలనీకి చెందిన పి.పావని (44) గృహిణి. ఈ నెల 4న ఇంట్లో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బంజారాహిల్స్‌లోని కేర్‌ దవాఖానలో చేర్పించారు. సుమారు 15 రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేదు. ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ వల్ల బ్రేయిన్‌ డెడ్‌ అయ్యిందని న్యూరో వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ కో ఆర్డినేటర్లు కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వారికి వివరించగా అందుకు అంగీకరించారు. పావని శరీరం నుంచి రెండు కండ్లు, మూత్రపిండాలు, కాలేయాన్ని సేకరించారు. అత్యవసర చికిత్సలో అవసరమైన రోగులకు వాటిని అందజేస్తామని వైద్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.