తిరుగుప్ర‌యాణంలోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు

విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్‌ జాం

అమ‌రావ‌తి: సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజాలు దాటేప్పుడు ఈ రద్దీ ఇంకా విపరీతంగా ఉంటోంది. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే 12 వేల వాహనాలు టోల్‌ప్లాజాను దాటినట్లుగా సమాచారం.

Leave A Reply

Your email address will not be published.