తిరుపతి, షిరిడీకి టీఎస్‌టీడీసీ ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: పర్యాటకులకు ఆకర్షించేందుకు టీఎస్‌టీడీసీ షిరిడీ, తిరుపతికి ప్రత్యేక వోల్వో బస్సు సర్వీసులు ప్రవేశపెట్టనుంది. అలాగే హైదరాబాద్ నగరంలో రెండు ఎలక్ట్రికల్ బస్సులను కూడా సందర్శకుల కోసం తీసుకురానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం రైళ్ల సాధారణ రాకపోకలు సరిపడా లేక చాలామంది దూరప్రయాణాలను వాయిదా వేసుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో షిరిడీ, తిరుపతి ప్యాకేజీలు సందర్శకులను ఆకట్టుకుంటాయని పర్యాటకశాఖ అధికారులు చెప్తున్నారు. దూర ప్రయాణికుల కోసం ఈ బస్సులను తొందరలోనూ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.