హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: పెండింగ్ కేసులో తీర్పు రాకపోవడంపై నిరాశకు గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం హైకోర్టులో కలకలం సృష్టించింది. నిరాశలో ఆమె హైకోర్టు మొదటి అంతస్థు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.
వివరాలు… పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ మహిళకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో ఉంది. ఈ కేసు రోజులు గడుస్తున్నా తీర్పు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. విచారిస్తే ఈ ఏడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఓ ఘటనపై ఆమె కేసు నమోదు చేసినట్లు తెలిసింది.