తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: యాస్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30– 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నది పేర్కొంది.