తెలంగాణతో కొత్త‌గా 158 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 158 క‌రోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలోనమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,900కి చేరింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆదివారం ఉద‌యం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2,96,373 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1886 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా ఒకరు కరోనాతో మృతి చెందారు. తాజా మ‌ర‌ణంతో క‌లిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1641కి చేరింద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.