తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఎక్కడెక్కడంటే..
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శనివారం దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించాలని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు ఉదయం నుంచి డ్రై రన్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపిహెచ్‌సి, సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి,
మహబూబ్‌నగర్ జిల్లాలో ని ప్రభుత్వ పిహెచ్‌సి, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్రై రన్ నిర్వహించనున్నారు. టీకా ప్రారంభానికి ముందు ఏవైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించడమే ఈ డ్రై రన్ లక్ష్యం.