తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 2579 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది. తాజాగా 1752 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 84,163 కు చేరింది. ప్రస్తుతం 23,737 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 23,737 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌కేంద్రాల్లో 17,226 మంది ఉన్నారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. వరుసగా రెండు రోజులు రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్‌కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ‌పరిధిలోనే 295 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 52,933 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 10, 21,054 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 295, రంగారెడ్డి జిల్లాలో 186, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 106 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 83, ఖమ్మంలో 161, వరంగల్ ‌అర్బన్‌ జిల్లాలో 143, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 31, ఆదిలాబాద్ ‌జిల్లాలో 34, జగిత్యాల జిల్లాలో 98, జనగామా జిల్లాలో 46, జోగుళాంబా గద్వాల జిల్లాలో 47, నల్గొండ జిల్లాల్లో 129, కామారెడ్డి జిల్లాల్లో 64, సిద్దిపేట జిల్లాల్లో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 59, పెద్దపల్లి జిల్లాల్లో 85, సూర్యాపేట జిల్లాల్లో 78, నిజమాబాద్ జిల్లాలో 142, మహబూబాబాద్‌ జిల్లాల్లో 81, మహబూబ్‌నగర్ ‌జిల్లాలో 69, నారాయణపేట జిల్లాలో 19, కొమురంభీం ఆసిఫాబాద్ ‌జిల్లాలో 10, మెదక్ ‌జిల్లాలో 42, ములుగు జిల్లాలో 16, నిర్మల్‌ జిల్లాలో 28, సంగారెడ్డి జిల్లాలో 30, వికారాబాద్ ‌జిల్లాలో 23, వనపర్తి జిల్లాలో 56, యాదాద్రి భువనగిరి జిల్లాలో 46, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 48, మంచిర్యాల జిల్లాలో 104, కరీంనగర్ ‌జిల్లాలో 116, కామారెడ్డి జిల్లాలో 64, భూపాలపల్లి జిల్లాలో 12, జగిత్యాల జిల్లాలో 98, ఆదిలాబాద్ ‌జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.