తెలంగాణలో కొత్త‌గా 163 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 40,181 శాంపిల్స్ టెస్ట్ నిర్వ‌హించ‌గా 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒక మరణం సంభవించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే తాజాగా 157 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,086కు చేరింది. అలాగే 2,95,544 మంది రికవరీ అయ్యారు. తాజా మ‌ర‌ణంతో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 1635 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,907 యాక్టివ్‌ కేసులు ఉన్నాయ‌ని బులిటెన్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.