తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 168 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. వీటిలో 2,95,707 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అయితే తాజాగా రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలు సంభవించలేదు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1635గా ఉన్నదని అధికారులు వెల్లడించారు.