తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 189 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజాగా 176 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కాగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342కు చేరరింది. తాజాగా 176 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో రికవరీ కేసులు 2,96,916కు పెరిగాయి. కాగా గత 24 గంటల వ్యవధిలో ఇద్దరు కరోనాతో మృతిచెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు కరోనాబారినపడి 1646 మంది మృతిచెందారని అధికారులు వెల్లడించారు.