తెలంగాణలో కొత్త‌గా 394 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 64,898 కరోనా టెస్టులు నిర్వహించగా 394 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118కి చేరింది. వీటిలో 2,98,645 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,804 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా కరోనాతో రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1669 కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.