తెలంగాణలో కొత్తగా 574 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,556కి చేరింది. ఇందులో 2,75,217 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,815 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనాతో 1524మంది మృతి చెందారు.