తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొంత మేర పెరిగాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,72,123 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,61,820 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,826 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1467 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజు 802 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని బులెటిన్ లో పేర్కొన్నారు.