తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

హైద‌రాబాద్‌: పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,267 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,52,455కు చేరింది. వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 1831, మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,52,455 కు చేరుకుంది… ఇప్పటి వరకు 2,32,489 మంది కరోనాబారినపడి రికవరీ కాగా.. 1385 మంది మృతి చెందారు. కోవిడ్‌ మరణాల రేటు భారత్‌ వ్యాప్తంగా 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.54 శాతానికి పడిపోయింది.. ఇక, రికవరీ రేటు దేశంలో 9261 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.09% శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 18,581 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,794 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.. మరోవైపు.. మంగళవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 42,490 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 201 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

 

Leave A Reply

Your email address will not be published.