తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వానలు కురిసే అవకాశం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కారణంగా రానున్న మూడు రోజుల్లో పలుజిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాగా కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు కురిసాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా బంట్వారంలో 53.3 మిలీమీటర్ల వర్షం కురిసింది.