తెలంగాణ‌కు నేడే టీకా రాక

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ సోమవారం హైదరాబాద్‌కు 6.5 లక్షల డోసులు చేరుకోనున్నాయి. పుణె నుంచి ప్ర‌త్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. తొలిరోజు మొత్తం 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

హైదరాబాద్‌-13, వరంగల్‌ రూరల్‌-4, వరంగల్‌ అర్బన్‌-6, కరీంనగర్‌-4, ఖమ్మం-6, ఆదిలాబాద్‌లో-3, భద్రాద్రి కొత్తగూడెం-4,  జగిత్యాల-2, జనగామ-2, జయశంకర్‌ భూపాలపల్లి-3, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-4, కుమ్రంభీం ఆసిఫాబాద్‌-3, మహబూబాబాద్-4, మహబూబ్‌నగర్‌-4, మంచిర్యాల-2, మెదక్‌-2, మేడ్చల్‌ మల్కాజిగిరి-11, ములుగు-2, నాగర్‌కర్నూల్‌-2, నల్లగొండ-3, నారాయణపేట-3, నిర్మల్‌-3, నిజామాబాద్‌-6, పెద్దపల్లి-4, రాజన్న సిరిసిల్ల-4, రంగారెడ్డి-9, సంగారెడ్డి-6, సిద్దిపేట-3, సూర్యాపేట-3, వికారాబాద్-3, వనపర్తి-4, యాదాద్రి భువనగిరి-3.

Leave A Reply

Your email address will not be published.