తెలంగాణ‌లో కొత్తగా 661 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 21,264 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా 661 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 2,57,374కి చేరింది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.
క‌రోనా బారి నుండి నిన్న‌ 1,637 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌హ‌మ్మారి బారినుంచి 2,40,545 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 15,425 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 12,888 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. నిన్న మ‌రో ముగ్గురు బాధితులు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనాతో మృతిచెందిన‌వారి సంఖ్య 1,404కు పెరిగింది. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 167 కేసులు న‌మోద‌వ‌గా, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చ‌ల్ జిల్లాలో 45 చొప్పున కేసులు రికార్డ‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.