తెలంగాణలో సఫాయి కర్మచారికే తొలి టీకా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి టీకా సఫాయి కర్మచారికే వేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుండి కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం నేపథ్యంలో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి బుధవారం 20 వేల కొవాగ్జిన్ డోసులు వచ్చినట్లు తెలిపారు. 139 సెంటర్లలో మొదటి రోజు ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొదట్లో ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు, తర్వాత ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. తర్వాత రోజు 50, ఆ తర్వాత 100 ఇలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నట్లు వెల్లడించారు.