తెలంగాణ‌: TIMSలో 199 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైద‌రాబాద్‌: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(TIMS)లో 199 ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టిమ్స్ డైరెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాల్లో వివిధ విభాగాల్లో 199 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నింటినీ వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అప్లికేషన్ ఫారం కోసం. మ‌రిన్ని వివారాల కోసం https://dme.telangana.gov.in/వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని స్పష్టం చేశారు.

పోస్టుల వివరాలు:

  • మొత్తం ఖాళీలు- 199
  • మెడికల్ ఆఫీసర్- 94
  • ప్రొఫెసర్- 12
  • అసోసియేట్ ప్రొఫెసర్- 23
  • అసిస్టెంట్ ప్రొఫెసర్- 22
  • నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2- 1
  • అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్- 6
  • స్టాఫ్ నర్స్- 32
  • డైటీషియన్- 1
  • ఫార్మాసిస్ట్- 8

అర్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.

ఇంటర్వ్యూ జరిగే స్థలం: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా.

ఇంటర్వ్యూ సమయం:

  • ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్ పోస్టులకు ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులకు ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

వయసు: 2021 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు నిండరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు ఉంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయస్సు 65 ఏళ్లు.

Leave A Reply

Your email address will not be published.