తెలంగాణ, కర్ణాటక మధ్య రాకపోకలపై ఆంక్షలు

వికారాబాద్ (CLiC2NEWS): కరోనా విజృంభిస్తున్న వేళ కట్టడికోసం తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ రోజు (గురువారం) నుంచి వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలం రావులపల్లి, తాండూర్ మండలం కొత్లా పూర్‌ల వద్ద అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం పోలీసు, రెవెన్యూ, మైనింగ్, రవాణా, అటవీ శాఖల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.