తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా నియంత్రణ చర్యలు, వానాకాలం పంటల సాగు సహా ఇతర అంశాలపై ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతిండంలేదు.
రైతుబంధు, ఎరువులపైనా చర్చ
అటు ఇంటింటి జ్వర సర్వే, కొవిడ్, బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. టీకాలపై జరగనున్న చర్చరాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. టీకాల కార్యక్రమంపైనా భేటీలో చర్చ జరగనుంది. వర్షాకాల వ్యవసాయ సీజన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది.