తెలంగాణ కొత్తగా 394 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 40,190 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. ఇందులో 2,80,505 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,388 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మొత్తం 1549 మంది మృతి చెందారు. కరోనా కొత్త వైరస్ కేసులు కూడా రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. రాష్ట్రంలో సెకండ్ వేవ్ లేదని, ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.