తెలంగాణలో కొత్త‌గా 536 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 52,057 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 536 పాటిజివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతోనమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,135కి చేరింది.  ఈ మేర‌కు వైద్య ఆరోగ్య‌శాఖ బుధ‌వారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. ఇందులో 2,70,450 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7,183 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తెలంగాణలో కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1502కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.