తెలంగాణ కొత్తగా 602 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 24,139 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 602 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా 1,015 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక, మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,64,128కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,51,468కు పెరిగింది.. ఇప్పటి వరకు కరోనాబారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 1433 మంది మృతిచెందారు. మరోవైపు దేశ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే. రాష్ట్రంలో 0.54 శాతానికి పడిపోయిందని.. భారత్‌లో రికవరీ రేటు 93.7 శాతంగా ఉంటే. రాష్ట్రంలో 95.20 శాతంగా ఉందని బులెటిన్‌లో సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,227 యాక్టివ్ కేసులు ఉండగా, వారిలో 8,942 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని పేర్కొంది. నిన్న ఆదివారం కావడంతో కరోనా టెస్ట్‌ల సంఖ్య కూడా భారీ తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 24,139 టెస్ట్‌ల నిర్వహించామని దీంతో. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 51,58,474కు చేరింది సర్కార్ తెలిపింది.