శరీరానికి అవ‌స‌ర‌మైన పోషకాల‌లో ఐరన్ ఒకటి..

మన శరీరానికి అవ‌స‌ర‌మైన పోషకాల‌లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను మ‌నం రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉండ‌దు. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది. అయితే మనకు ఐరన్ ఎక్కువగా అందాలంటే.. ఏయే ఆహారాలను నిత్యం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లు: అన్ని రకాల ప్రొటీన్లు గుడ్డులో ఉన్నాయి. హై క్వాలిటీ ప్రొటీన్స్​, విటమిన్స్​, మినరల్స్​, శరీరానికి మేలు చేసే ఆమ్లాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఐరన్​ విషయానికొస్తే.. మిగతా వాటికంటే ఒక ఆకు ఎక్కువే చదివి.. ఐరన్​ అంటే ఎగ్​ అనిపించుకుంది.

రక్తహీనతతో బాధపడేవారికి కోడిగుడ్డు పరమౌషధం. రోజుకు రెండు గుడ్లు తింటే.. రక్త హీనతకు చాలా తక్కువ టైమ్​లో చెక్​ పెట్టొచ్చు. ప్రతిరోజూ బ్రేక్​ఫాస్ట్​లో ఉడికించిన గుడ్డు తింటే.. బాడీలో ఐరన్​ శాతం దానంతటదే పెరిగిపోతుంది.

చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజలకు రక్తహీనతకు చెక్​ పెట్టగల శక్తి వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందని. రోజుకు అరకప్పు చిక్కుడు జాతి గింజలు అంటే.. బొబ్బర్లు, చిక్కుడు, కందులు, శెనగలు, బఠానీల వంటి గింజలు ఉడకబెట్టి తింటే.. శరీరానికి కావాల్సిన 20 శాతం ఐరన్​ లభిస్తుంది.

 

ఆకుకూరలు: ఐరన్​ గురించి చెప్పాలంటే.. ఐరన్​ అంటూ లేని ఆకుకూరలే ఉండవు. అందుకే.. ఆకుకూరలు తింటే.. శరీరానికి కావాల్సిన ఐరన్​ అందుతుంది. అందుకే పోషక పదార్థాల కోసం ఆకుకూరలు తినమని చెప్తారు డాక్టర్లు. అయితే.. ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ – సి ఆకు కూరల్లో కావాల్సినంత ఉంటుంది. విటమిన్​ – సి శరీరంలో ఐరన్​ని రెట్టింపు చేస్తుంది. అంతేకాదు.. యాంటీ ఆక్సిడెంట్స్​​ కూడా ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి.

 

నట్స్​:  “నట్స్​ తినండి’ అని. బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, వాల్​నట్స్​, పల్లీలు, జీడిపప్పు లాంటి నట్స్​ క్రమం తప్పకుండా తింటే చాలా తక్కువ టైమ్​లో ఆరోగ్యం పుంజుకుంటుంది“ అని శరీరంలో పోషకాల శాతం తగ్గిందన‌గానే డాక్టర్లు ముందుగా చెప్పేమాట.తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు, క్యాల్షియం లాంటి ప్రొటీన్స్​తో పాటు.. బాడీలో ఐరన్​ని పెంచే గుణాలు నట్స్​లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. వీలైనంత వరకు నట్స్​ తినడం అలవాటు చేసుకోవాలి.

 

డార్క్​ చాక్లెట్​: ఒక్క ఔన్సు డార్క్​ చాక్లెట్​లో 3.3 గ్రాముల ఐరన్​ ఉంటుంది. అంటే.. శరీరానికి కావాల్సిన ఐరన్​ కంటెంట్​లో 19 శాతం ఒక్క డార్క్​ చాక్లెట్​ బైట్​లో లభిస్తుందన్నమాట. ఎన్నో అధ్యయనాలు కూడా.. రక్తహీనతకు చెక్​ పెట్టాలంటే డార్క్​ చాక్లెట్​ తినాలని సూచించాయి. బాడీలో ఐరన్​ తక్కువ ఉన్నవాళ్లు రోజుకో బైట్​ డార్క్​ చాక్లెట్ తింటే.. సమస్య తగ్గుతుంది.

 

మ‌రికొన్ని..

  •  50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నిత్యం 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.అదే మహిళలకు అయితే 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. ఇక గర్భిణీలు 27 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాలి.
  • నువ్వులను నిత్యం తినడం వల్ల వాటిలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు నిత్యం నువ్వులను తింటే ప్రయోజనం కలుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నువ్వులను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
  • నువ్వులను వేయించి తీసుకోవచ్చు. లేదా అల్పాహారం, భోజనంలోనూ, బెల్లంతో చేసిన లడ్డూల రూపంలో, పెరుగు, సలాడ్లు, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా నువ్వులతో మనకు పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.
  • పాలకూర, ఇతర ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా అందుతుంది. అలాగే పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, ఉల్లికాడలు, బీన్స్‌లోనూ ఐరన్ ఉంటుంది.
  • మన శరీరానికి నిత్యం కావల్సిన ఐరన్‌లో 25 శాతం ఐరన్‌ను టమాటాలను తినడం వల్ల పొందవచ్చు. అలాగే బ్రొకొలి, పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీల్లోనూ ఐరన్ ఉంటుంది.
  • యాప్రికాట్స్, కోడిగుడ్లు, అవకాడో, కొత్తిమీర తదితర పదార్థాల్లోనూ ఐరన్ ఉంటుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల ఐరన్ బాగా అందుతుంది. దీంతో ఐరన్ లోపం, రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.

పూర్ణిమ‌

1 Comment
  1. Social Media Marketing says

    Wow, marvelous weblog layout! How lengthy have you ever been running a blog for? you make running a blog glance easy. The full look of your web site is great, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.