తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

సిద్దిపేట: జిల్లాలో పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను సిఎం కెసిఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో సీఎం ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి హరీశ్‌రావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.