తెలంగాణ సిఎస్ సోమేశ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్

‌హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధ‌రాణ‌  అయింది. త‌న‌కు కొవిడ్ సోకిన‌ట్లు సిఎస్ స్వ‌యంగా వెల్ల‌డించారు. నిత్యం వివిధ శాఖ‌ల‌తో ఎడ‌తెరిపిలేని స‌మీక్ష‌ల‌తో ఎప్ప‌డూ బిజీగా ఉండే ఆయ‌న‌, కాస్త అస్వ‌స్థ‌త‌గా ఉండ‌టంతో కొవిడ్ ప‌రీక్ష చేయించుకున్నారు. పరీక్ష‌ల్లో వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు తేలింది.

వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.